తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బొలేరో బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం - eturunagaram jampanna vagu bridge latest news

కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనానికి ఏటూరునాగారం మండలం సమీపంలో జంపన్న వాగు బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. 12మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

one person died at accident eturunagaram and 12 persons seriously injured
బొలేరో బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

By

Published : Dec 5, 2020, 5:25 PM IST

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం సమీపంలో జంపన్న వాగు బ్రిడ్జి వద్ద 163 జాతీయ రహదారిపై 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురి పరిస్థితి విషమించడంతో.. 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 12 మందిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ నూతి ప్రమీల(45) మృతి చెందింది.

వాహనం ఏటూరునాగారానికి చెందిన కూరగాయల వ్యాపారి పవన్‌కు చెందిందని.. డ్రైవర్ శివ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కూలీలు తెలిపారు. డ్రైవర్ మొదటగా 60 మందిని ఎక్కించి 25 మందిని దించాడని వారు చెప్పారు.

ఇదీ చూడండి:టార్గెట్ బెగ్గర్స్: సైబర్ వలలో యాచకులు!

ABOUT THE AUTHOR

...view details