తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి - యాదాద్రి భువనగిరిజిల్లా నేర వార్తలు

విద్యుతాఘాతానికి గురై ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

one person dead with electric shock at vangapally village in yadadri bhuvanagiri district
విద్యుదాఘాతంతో భవననిర్మాణ కార్మికుడు మృతి

By

Published : Oct 4, 2020, 7:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో విద్యుతాఘాతంతో సురేశ్​ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఓ భవన నిర్మాణంలో పని చేస్తుండగాా ప్రమాదవశాత్తు కరెంట్​షాక్​కు గురై సురేశ్​ అక్కడికక్కడే మరణించాడు.

మృతుడికి సంవత్సరం క్రితమే వివాహం అయ్యిందని తోటి పనివారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

ఇదీ చూడండి:నెల రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రేమ బాధితురాలు

ABOUT THE AUTHOR

...view details