తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో యువకుడు మృతి - కరెంట్​ షాక్​తో యువకుడి మరణం

రోజులాగే పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఓ యువకుడిని కరెంటు తీగల రూపంలో మృత్యువు కబళించింది. నాగర్ కర్నూల్​ జిల్లా బోడబండ తండా సమీపంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

one person dead with electric shock at boda banda tanda in nagarkurnool district
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

By

Published : Sep 8, 2020, 11:01 PM IST

మహబూబ్​ నగర్ జిల్లా వెల్కిచర్ల గ్రామానికి చెందిన షరీఫ్ (25 )అనే యువకుడు కొల్లాపూర్​లోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వద్ద మెగా కంపెనీలో టిప్పర్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అయితే రోజూలాగే పనులు ముగించుకొని నాగర్​కర్నూల్​ జిల్లా బోడబండ తండా సమీపంలోని తన ఇంటికి వచ్చాడు.

కాగా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై మురళిగౌడ్​ చెప్పారు.

ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details