తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి - యాదాద్రి భువనగిరి లేటెస్ట్ న్యూస్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.

one-person-dead-in-road-accident-at-yadadri-bhuvanagiri-district
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి

By

Published : Dec 7, 2020, 9:44 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని తుక్కపురం క్రాస్ రోడ్డు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు.

మృతుడు ఆలేరు మండలం గొలనుకొండకి చెందిన అరుణ్​గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అరుణ్ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు

ABOUT THE AUTHOR

...view details