క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి.. ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి యాభై వేల రూపాయలతో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆకాష్ మొహతా కుటుంబంతో గత పది సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌కు వలస వచ్చి వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతను క్రికెట్ బెట్టింగ్‌లలో పందాలు కాసేవాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించిన ఆకాష్... తానే స్వయంగా బెట్టింగ్ నిర్వాహకుడిగా అవతారమెత్తాడు.
క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల దాడి... ఓ యువకుడు అరెస్ట్ - క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద 50 వేల రూపాయల నగదుతో పాటు రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల దాడి.
మరో నిర్వాహకుడు మొటూ బండారితో కలిసి వెబ్‌సైట్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహించేవాడు. రాంగోపాల్‌పేట్ ప్రాంతంలో ఓ ఇంట్లో వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ఆకాష్‌ను పట్టుకున్నారు. మొటూ పరారయ్యాడు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... తొమ్మిది లక్షలు స్వాధీనం