వృద్ధురాలకి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం హెచ్‌ఎంటీ కాలనీలో నివాసముంటున్న ప్రదీప్ అనే వ్యక్తి ఇంట్లో పనిమనిషులుగా ఉన్న నేపాల్ దంపతులు అర్జున్, మాయ చోరికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు విధుల నిమిత్తం బయటకు వెళ్లగా అదను చూసి నేపాల్ దంపతులు ఇంట్లో ఉన్న వృద్ధురాలి నోట్లో మత్తుమందు గుడ్డను కుక్కి స్పృహా కోల్పోయేలా చేశారు.
అనంతరం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, పది లక్షల నగదు, ఇరవై తులాల బంగారు ఆభరణాలు అపహారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 14 రోజుల క్రితం ఓ ఏజెన్సీలో పనిచేస్తోన్న నేపాల్‌కు చెందిన రాజ్‌బహుదూర్ ద్వారా ప్రదీప్ ఇంట్లో పనిలో చేరారు.