ఈ నెల 16న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యాయామ ఉపాధ్యాయుడు కాటి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మరణానికి విష ప్రయోగం కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతను మరో ఏడుగురిని అంతమొందించాడని విచారణలో తెలిసింది. నిందితుడు ఏలూరులో 3, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, బొమ్మూరు పరిధిలో 4, కృష్ణాజిల్లాలో ఒకటి చొప్పున హత్యలకు పాల్పడినట్లు సమాచారం.
అమ్మో: 8 మందిని విషం పెట్టి చంపేశాడు - apartment crime news in west godavari
ఓ అపార్ట్‌మెంట్‌లో కాపలాదారుగా పని చేశాడతను. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. మోసాల బాట పట్టాడు. తన గురించి ఎవరైనా పసిగడితే... వారికి ఆహారంలో విషమిచ్చి చంపేవాడు. ఇలా ఎనిమిది మందిని హతమార్చినట్లు తెలిసింది. ఇటీవల ఏలూరులో జరిగిన హత్యోదంతంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
crime
ప్రత్యేకతలు ఉన్న నాణేలు, రెండు తలల పాముల పేరిట పలువురిని నిందితుడు మోసం చేసేవాడు. ఈ క్రమంలో తన సంగతిని పసిగట్టిన వారిని, నమ్మకంగా వేర్వేరు చోట్లకు రప్పించి, ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో విషం పెట్టి అందించేవాడని, దానిని తీసుకున్న వారు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు విడిచే వారని సమాచారం.