కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో భారీగా ప్రభుత్వ నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాల వెళ్లే బస్సులో గుట్కా తరలిస్తున్న వ్యక్తిని రెబ్బెన పోలీసులు పట్టుకున్నారు.
రూ. లక్షా 14వేలు విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం - గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న రెబ్బెన పోలీసులు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాల వెళ్లే బస్సులో నిషేధిత గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. లక్షా 14 వేలు విలువచేసే గుట్కాను రెబ్బెన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ. లక్షా 14వేలు విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం
రెబ్బెన ఎస్సై రమేష్, కాగజ్‌నగర్ ఎస్సై గంగన్న.. పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టగా.. సుమారు రూ.లక్షా 14 వేలు విలువచేసే గుట్కా లభించింది. ఈ మేరకు విజయ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే విజయ్‌పై గతంలోనూ నిషేధిత గుట్కా రవాణా కేసులున్నట్లు గంగన్న తెలిపారు.
ఇదీ చదవండిఃబాలు పార్థివదేహానికి అశ్రునివాళి- భారీగా తరలిన జనం