తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లక్ష రూపాయల విలువ చేసే గుట్కా స్వాధీనం - illegal gitka bussiness

నల్గొండ జిల్లా దామరచర్ల మండల బొత్తలపాలెంల్​ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో లక్ష రూపాయల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

one lakh worth gutka caught by police in bothalapalem
one lakh worth gutka caught by police in bothalapalem

By

Published : Oct 10, 2020, 11:40 AM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెంలో పెద్దఎత్తున గుట్కా పట్టుబడింది. గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాయల ప్రవీణ్​.. షేక్​ షరీఫ్​ సాయంతో సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాను ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

లక్ష రూపాయల విలువ చేసే గుట్కా స్వాధీనం

లక్ష రూపాయలు విలవచేసే గుట్కాను, ఓ ఆటో, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత గుట్కాను అమ్ముతున్న, తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details