మహబూబ్నగర్ జిల్లాలో కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా తెరాస శ్రేణులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా కరివేన జలాశయం వద్ద జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు.
తెరాస ట్రాక్టర్ ర్యాలీలో అపశ్రుతి.. ఒకరు మృతి - accident in trs tractor rally in mahabubanagar
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతునిస్తూ మహబూబ్నగర్లో తెరాస శ్రేణులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. మిడ్జిల్ సమీపానికి రాగానే రెండు ట్రాక్టర్లు ఢీకొనగా.. ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ రాజు చనిపోయాడు.

తెరాస ట్రాక్టర్ ర్యాలీలో అపశ్రుతి.. ఒకరు మృతి
బాలానగర్, జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్ పేట, రాజాపూర్, ఊరుకొండ పేట మండలాల నుంచి తెరాస శ్రేణులు ట్రాక్టర్లలో ర్యాలీగా బయలుదేరారు. మిడ్జిల్ సమీపానికి రాగానే ర్యాలీలో రెండు ట్రాక్టర్లు ఢీకొనగా ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో జగబోయిన్పల్లి గ్రామానికి చెంది రాజు అనే డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడు.