హైదరాబాద్ తుకారాం గేటు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని సంగీత్ కూడలి వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు - car hits a bike at sangeeth signal
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్ సంగీత్ కూడలి వద్ద చోటుచేసుకుంది. సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కారు డ్రైవర్ గందరగోళానికి గురయ్యాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

తుకారాంగేట్ వద్ద రోడ్డు ప్రమాదం
ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన నర్సింగ్ కారులో వెళ్తూ తుకారాం గేట్‌కు చెందిన రాకేశ్‌ను సంగీత్ కూడలి వద్ద ఢీకొట్టాడు. సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కారు డ్రైవర్ గందరగోళానికి గురయ్యాడని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫలితంగా ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు.
- ఇదీ చూడండిద్విచక్రవాహనం, ఓమిని ఢీ... ఒకరు మృతి