తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య అత్తారింటికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం - హైదరాబాద్​లో ఒక భర్త ఆత్మహత్యాయత్నం

పుట్టింటి నుంచి అత్తారింటికి భార్య రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలబ్​కట్టలో చోటుచేసుకుంది.

one husband suicide attempt at old city in hyderabad
భార్య అత్తారింటికి రాలేదని భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 14, 2020, 6:39 PM IST

పుట్టింటి నుంచి అత్తారింటికి భార్య రాలేదని మహ్మద్ శబజ్ అనే వ్యక్తి కత్తితో కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న భవానినగర్ పోలీసులు క్షతగాత్రుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

సంతోష్ నగర్​కి చెందిన మహ్మద్ శబజ్ ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం అతనికి భవానినగర్​కి చెందిన బేగంతో పెద్దలు రెండో పెళ్లి చేశారు. అయితే అతను నిత్యం మద్యం సేవించి వచ్చి భార్య బేగంని కొట్టడం, చిత్రహింసలకు గురిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆమె తన భర్తపై మహిళాపోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసి.. ఆమె పుటింటికి వెళ్లిపోయింది. అయితే ఈరోజు బేగంను తన ఇంటికి రావాలని శబజ్​ గొడవపడ్డాడు. కాగా తాను రాననడం వల్ల మద్యం మత్తులో కత్తితో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.


ఇదీ చూడండి:
రోడ్డు దాటుతుండగా ప్రమాదం... యువతి అక్కడికక్కడే మృతి

ABOUT THE AUTHOR

...view details