తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి 150 గొర్రెలు మృతి - telangana news

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి గొర్రెలు మృతి చెందిన ఘటన... కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. మేత కోసం వెళ్లి తిరిగి వస్తుండగా... ప్రమాదం జరిగింది. బాధితులను మంత్రి ఈటల రాజేందర్​ పరామర్శించి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

one fifty sheeps died in navajeevan express accident at madipally railway gate
పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి 150 గొర్రెలు మృతి

By

Published : Dec 19, 2020, 10:18 PM IST

పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి 150 గొర్రెలు మృతి

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి రైల్వే గేటు సమీపంలో వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న గొర్రెలు, మేకలను నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీ కొట్టడం వల్ల సుమారు 150 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు పదిలక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు బాధితులు రైతులు తెలిపారు. జమ్మికుంట మండలం మాచినపల్లికి చెందిన సుమన్‌, రాజకొమురు, తిరుపతి, ఐలయ్య, ఓదేలు, పెద్దకొమురయ్యలకు చెందిన 150 గొర్రెలు మేతకు మడిపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లారు.

ఇంటికి తరలించేందుకు రైల్వే గేటు దాటుతుండగా... బల్లార్ష నుంచి కాజీపేటకు వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ గొర్రెలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 150 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధిత రైతు కుటుంబాలను రాష్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పరామర్శించి... పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆడుకుంటున్నాయి

ABOUT THE AUTHOR

...view details