తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి - Medak district crime news

బోరు మోటారుకు సరఫరా అయ్యే విద్యుత్ తీగలను సరిచేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివ్వపేట మండలం గోమారం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

one died with electric shock in medak district
మెదక్​లో విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదం

By

Published : Nov 16, 2020, 5:43 PM IST

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన అబ్ధుల్ అలీ వ్యవసాయ బోరు వద్ద విద్యుత్ స్తంభంపై లైన్ కట్ అవ్వడం వల్ల గూడెపు లక్ష్మణ్ అనే వ్యక్తిని మరమ్మతుకు పిలిపించారు. విద్యుత్ సరఫరా నిలిపివేశామని చెప్పగా.. మరమ్మతు చేయడానికి స్తంభం పైకి ఎక్కాడు. వైర్లు సరిచేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా జరిగి లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ అధికారులు సకాలంలో రాకపోవడం వల్లే మరమ్మతు చేసే క్రమంలో లక్ష్మణ్ ప్రమాదానికి గురయ్యాడని స్థానికులు తెలిపారు. సకాలంలో స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరొకటి!

ABOUT THE AUTHOR

...view details