కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి గ్రామానికి చెందిన మామిడిపల్లి శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి - tractor rolled over in karimnagar
వ్యవసాయ పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
![గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి one died when tractor rolled over in karimnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9632022-665-9632022-1606104674047.jpg)
గేదెల మందను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
తన పొలంలో వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని శ్రీధర్ ఇంటికి బయలు దేరాడు. దారిలో గేదెల మందను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.