యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి నుంచి గజ్వేల్‌కు వెళ్తున్న ఆటోను తుర్కపల్లి నుంచి వస్తోన్న కారు వాసాలమర్రి గ్రామశివారులో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలోని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
వాసాలమర్రిలో ఆటో-కారు ఢీ.. ఒకరు మృతి - road accident in bhuvanagiri district
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, కారు ఢీ కొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వాసాలమర్రిలో ఆటో-కారు ఢీ
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను, మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్రకాశం జిల్లా విశ్వనాధపురానికి చెందిన వెంకటనారాయణగా గుర్తించారు.
- ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం