వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ పోస్టల్ కాలనీకి చెందిన బోడ జశ్వంత్ కేటీఎమ్ బైక్‌పై హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని హనుమాన్ స్టేజీ వద్ద టర్న్ అవుతుండగా.. ఆటోను బలంగా ఢీకొట్టాడు.
ఆటోను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - bike hits auto in rampur
ద్విచక్రవాహనం ఆటోను ఢీకొట్టడం వల్ల ఇంటర్ విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలు విరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను ఢీకొట్టిన ద్విచక్రవాహనం
ఈ ఘటనలో ఆటోలోని వ్యక్తి కాలు విరగగా.. జశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం వల్ల చికిత్స పొందుతూ జశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- ఇదీ చూడండి :అశ్రద్ధ వహిస్తే ఫేస్ 'బుక్' అయినట్టే!