అతివేగంగా వస్తున్న ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్‌లో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు - పెద్దపల్లి జిల్లా నేర వార్తలు
ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన ఘటన పెద్దపెల్లి జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు One died two injured in road accident in peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9974355-207-9974355-1608691417405.jpg)
జిల్లాలోని మంథని మండలం అడ్రియాల గ్రామానికి చెందిన శనిగారపు శంకర్ తన ఐదేళ్ల కూతురుతో పాటుగా బంధువైన మరో మహిళతో కలిసి ద్విచక్ర వాహనంపై మంథని వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంతో ఎదురుగా వస్తున్న ఓ కారు వారి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో శంకరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన కూతురు సహా మరో మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఎంపీ అర్వింద్ ర్యాలీలో తల్వార్లతో నృత్యాలు... ఏడుగురిపై కేసు