రైలు ఢీకొట్టి ఓ వ్యక్తి మరణించిన ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. బైబిల్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఈరోజు ఉదయం రైలు పట్టాలు దాటుతున్న సమయంలో సికింద్రాబాద్ వైపు వచ్చిన రైలు ఢీకొట్టింది. బలమైన గాయాలు కావడం వల్ల వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు.
రైలు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి - రైలు ప్రమాదంలో వ్యక్తి మరణం
సికింద్రాబాద్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైలు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల చనిపోయినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'మహిళల వివాహ కనీస వయసుపై త్వరలోనే నిర్ణయం'