లారీ ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. బాబానగర్‌కు చెందిన అర్మాన్ అనే విద్యార్థి ద్విచక్రవాహనంపై చంద్రాయణగుట్ట నుంచి బాబానగర్ వెళ్తుండగా.. అదే మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... విద్యార్థి దుర్మరణం - hyderabad news
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటన హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... విద్యార్థి దుర్మరణం
సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. ప్రయాణికులు సేఫ్