సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై ముంబయి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు.. సత్వార్ కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వల్ల అందులో ప్రయాణించే నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా.. ఒకరు మృతి - car hits a bike in zaheerabad
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ కూడలిలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

జహీరాబాద్లో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా ఢీకొట్టడం వల్ల వాహనం నడుపుతున్న వ్యక్తి సుమారు వంద మీటర్ల దూరం ఎగిరిపడి మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండిశిక్షణ విమానం కుప్పకూలి పైలట్ మృతి