కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామానికి చెందిన గడమల్ల ప్రభాకర్.. సదాశివపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు,
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి - karimnagar road accident
తరచూ ప్రమాదాలతో భీతిల్లిన రహదారులు నెలన్నర రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్తో ఊపిరి పీల్చుకున్నాయి. ప్రభుత్వం నిబంధనలు సడలించగా.. వాహనాల రాకపోకలు మొదలై ప్రమాదాలు జరుగుతున్నాయి.
కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభాకర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి కూరగాయలు తీసుకువచ్చే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.