సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోరే కాలనీకి చెందిన ప్రశాంత్ (25) ఇంటి ముందున్న రోడ్డు దాటుతుండగా... బీదర్ వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రశాంత్ గాల్లోకి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేగ నియంత్రణ కోల్పోయిన వాహనం అదుపుతప్పి.. ఇళ్లవైపు దూసుకొచ్చింది.
ప్రమాదం: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి - సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
డీసీఎం వాహనం ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రమాదం: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
ఘటనా స్థలాన్ని జహీరాబాద్ ఎస్సై వినయ్‌కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!