రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో షాబాద్ మండలం సీతారాంపూర్కు చెందిన వంశీగౌడ్ మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - rangareddy road accident
అతివేగంగా వచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు.
చెట్టును ఢీకొట్టిన కారు
క్షతగాత్రులను స్థానికులు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.