తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయి.. - కామారెడ్డి జిల్లా నేర వార్తలు

సెల్ఫీ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. భారీ వర్షాలతో నిజాం సాగర్​ జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టుని చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

one dead in nizam sagar project during taking a selfie
సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయి..

By

Published : Oct 17, 2020, 12:54 PM IST

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలో ఓ వ్యక్తి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి వరదలో కొట్టుకు పోయాడు. లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దేవగళ్ల రాములు(35) అనే వ్యక్తి నిన్న సాయంత్రం స్నేహితులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకి వెళ్లాడు. సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి ప్రాజెక్టు దిగువన పడటంతో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం కోసం జాలరులతో గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గేట్ల దిగువ భాగానికి పర్యాటకులు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో వరద మిగిల్చిన నష్టాలు తీరేదెలా?

ABOUT THE AUTHOR

...view details