వ్యాపారంలో నమ్మిన వ్యక్తులే మోసం చేశారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. గుడివాడ రాజేంద్రనగర్ 8వ లైన్లో ఉంటున్న ఉపప్రసాద్ చేపల చెరువు వ్యాపారాన్ని కొంతమందితో కలిసి మెుదలుపట్టాడు. భాగస్వామ్యులే మోసం చేశారని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి ముందు సూసైడ్ లేఖ రాశాడు.
నమ్మినవారే నట్టేట ముంచారని మనస్తాపంతో ఆత్మహత్య - ap news
వ్యాపార భాగస్వామ్యులు మోసం చేశారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.
నమ్మినవారే నట్టేట ముంచారని మనస్తాపంతో ఆత్మహత్య
తన భార్య బిడ్డలను బతకనివ్వండి.. దళితులను వ్యాపారం చేసుకోనివ్వరా అంటూ లేఖ రాశాడు. ఎవరెవరు ఎంత మెుత్తం ఇవ్వాలో పేర్లతో సహా లేఖలో పేర్కొన్నాడు. చివరిగా... వెళ్తున్నా అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.