నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మహ్మద్ అలీ అనే వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఖలీద్ అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నం.14లోని కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి తనదేనని నకిలీ పత్రాలు కోర్టుకు సమర్పించాడు. అంతే కాకుండా షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత, ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ను ఏసీబీకి పట్టించాడు. ఖలీద్ ఈ భూమాఫియాకు ప్రధాన నిందితుడుగా గుర్తించిన పోలీసులు... తాజాగా ముఠా సభ్యుడు మహ్మద్ అలీని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - హైదరాబాద్ వార్తలు
ఓ వ్యక్తి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పథకం పన్నాడు. అందుకోసం ప్రభుత్వ అధికారులకు లంచం ఎర చూపాడు. కక్కుర్తి పడిన అధికారులకు రూ.15 లక్షల లంచం ఇస్తూ వారిని అడ్డంగా అనిశా అధికారులకు పట్టించాడు. ఖలీద్ అనే వ్యక్తిని ఈ భూమాఫియాకు ప్రధాన నిందితుడు కాగా.. ఈ గ్యాంగ్ సభ్యుడు మహ్మద్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
షేక్‌పేట్ భూ వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్ట తహసీల్దార్ సుజాత, ఆర్, బంజారాహిల్స్ ఎస్సై కేసు దర్యాప్తులో భాగంగా ఖలీద్ సమర్పించినవి నకిలీ పత్రాలుగా అనిశా ఇన్స్పెక్టర్ గౌస్ తేల్చారు. దర్యాప్తులో ఈ ముఠా వ్యవహారం బయటకు వచ్చింది.
ఇవీ చూడండి:షేక్‌పేట్ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు