తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీళ్ల బకెట్​ రూపంలో కబళించిన మృత్యువు - పద్దెనిమిది నెలల బాబు మృతి నేరల్​ తండా

నాలుగన్నర ఏళ్లకు ఆ దంపతులకు అమ్మనాన్నలయ్యే అదృష్టం కలిగింది. ఆ అదృష్టాన్ని చూసి విధికి ఈర్శ్య పుట్టినట్టుంది. బాబు పుట్టాడన్న సంతోషాన్ని ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం మిగల్చలేదు. నీళ్ల బకెట్​ రూపంలో మృత్యువును తెచ్చి 18 నెలల బాబును చంపేసింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

నీళ్ల బకెట్​ రూపంలో కబళించిన మృత్యువు
నీళ్ల బకెట్​ రూపంలో కబళించిన మృత్యువు

By

Published : Nov 18, 2020, 10:46 PM IST

ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్​లో తలకిందులుగా పడి 18 నెలల బాబు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలోని భామన్ జగదీశ్​, సీతాబాయి దంపతులకు నాలుగున్నర ఏళ్లకు జన్మించిన ఏకైక సంతానం గోపాల్(18 నెలలు) ప్రమాదవశాత్తు నీటి బకెట్​లో పడి చనిపోయాడు.

నీళ్ల బకెట్​

బుధవారం సాయంత్రం బాబు ఆడుకుంటూ వెళ్లి నీటి బకెట్​లో తలకిందులుగా పడ్డాడు. బట్టలు ఉతుకుతున్న తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి తలకిందులుగా కనిపించాడు. తల్లి వచ్చి బకెట్ నుంచి బయటకు తీసేసరికి అప్పటికే బాబు మృతి చెందాడు. నాలుగున్నర ఏళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే మృతిచెందడం వల్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండి:రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details