జనగామ - సూర్యాపేట జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, ఓమిని గురువారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరు మండలం పారుపల్లికి చెందిన దయ్యాల జోగయ్య, ఆయన బంధువు మిర్యాల నర్సింహులు ద్విచక్రవాహనంపై దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెంలో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల ఓం శాంతి పత్తి మిల్లు వద్ద అదుపు తప్పి ద్విచక్రవాహనం, ఓమిని ఢీకొన్నాయి.
ద్విచక్రవాహనం, ఓమిని ఢీ... ఒకరు మృతి - jangaon district news
జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, ఓమిని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లింగాల ఘనపూర్ మండలంలోని నెల్లుట్లలోని పత్తిమిల్లు వద్ద వాహనాలు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. తలకు తీవ్ర గాయాలై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనం, ఓమిని కారు ఢీ... ఒకరు మృతి
ఈ ప్రమాదంలో జోగయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిర్యాల నర్సింహులు కాలు విరిగింది. క్షతగాత్రుడిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు.