'ఖాకీ' సినిమా తరహాలో హైదరాబాద్ పోలీసులు మరో సాహసం చేశారు. ముప్పుతిప్పలు పెడుతూ రూ. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న భరత్పూర్ ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్ల ముఠాను పట్టుకున్నారు. స్థానిక పోలీసులు సాయంతో 18 మందిని అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ సంబంధించిన వారి నుంచి క్యూఆర్ కోడ్‌తో రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఈ కేసులు ఎక్కువ అయినందున సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
18 మంది ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు - ఓఎల్ఎక్స్ మోసగాళ్లు అరెస్ట్
ఓఎల్ఎక్స్లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ.. ఫోన్ చేసిన వారిని క్యూఆర్ కోడ్‌తో డబ్బులు కొల్లగొట్టిన కొల్లగొడుతున్న భరత్పూర్ ఓఎల్ఎక్స్ సైబర్ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్లిన పది మంది సైబర్ క్రైం పోలీస్ బృందం భరత్పూర్ పోలీసుల సాయంతో దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో మూడు పోలీసు వాహనాలను చేసిన నిందితులు, వారి కుటుంబసభ్యులు ధ్వంసం చేశారు. అయినా ముందుకెళ్లిన పోలీసులు... వాజిత్ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్, ఇర్ఫాన్ రాహుల్, అజరుద్దీన్, తారీఫ్ఖాన్, ఉమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్లను అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. శనివారం మరో 10 మందిని అరెస్ట్ చేశారు.