తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైక్‌ లేకున్నా ఫొటో పెట్టి రూ.30 వేలు అన్నాడు... రూ.73వేలు దోచాడు - hyderabad cyber crime latest news

ఓఎల్‌ఎక్స్‌లో ఓ ద్విచక్రవాహనం నచ్చి దాని యజమానికి ఫోన్‌ చేశాడో వ్యక్తి. ధర రూ.30వేలు అని చెప్పాడు. తక్కువ ధరకే వస్తుంది కదా అని ముందుగానే అడ్వాన్స్ చెల్లించాడు. కానీ రూ.30వేలు అని చెప్పి... మొత్తంగా రూ.73వేలు వసూలు చేశాడు కేటుగాడు. మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

cyber crime
cyber crime

By

Published : Aug 10, 2020, 4:03 PM IST

ద్విచక్రవాహనం కొందామనుకొని హైదరాబాద్​ నామాల గుండు ఉప్పర్ బస్తీకి చెందిన రాజు ఓఎల్ఎక్స్‌లో వెతికాడు. అందులో ఓ వాహనం నచ్చి... దాని యజమానిని సంప్రదించాడు. అతను తాను మిలిటరీలో పని చేస్తున్నానని... హైదరాబాద్ నుంచి బదిలీ అయిందని... అందుకే రూ.30వేలకే అమ్ముతున్నాని చెప్పాడు. అది నమ్మిన రాజు బేరమాడి... ముందు కొంత అడ్వాన్స్‌గా పంపించాడు.

ఆ తర్వాత ఆర్మీ క్యాంప్ గేట్ పాస్ దాటడానికి కొంత టాక్స్ అని... ఇతరత్రా చెప్పి రూ.73వేల వరకు రాజు నుంచి తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు ఆ సైబర్ మోసగాడు. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో... మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details