సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడట్లేదు. హైదరాబాద్ కార్వాన్కు చెందిన వేదాంత శేషకుమార్.. తన ఇంట్లోని మంచం అమ్మకానికి ఉందని.. రూ. 14 వేలు ధరగా నిర్ణయించి ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
ఆన్లైన్ మోసం.. రూ. 99 వేలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు
ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉన్న మంచాన్ని చూశాడు ఓ వ్యక్తి. కొనుగోలు చేస్తానని యజమానికి ఫోన్ చేసి బేరం ఆడుకున్నాడు. అతనితో క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయించుకుని రూ. 99 వేలు సైబర్ నేరగాళ్లు దోచుకున్న ఘటన కార్వాన్లో జరిగింది.
ఆన్లైన్ మోసం.. రూ. 99 వేలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు
మంచానికి బేరమాడి శేషకుమార్తో క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేయించుకున్నాడు. వెంటనే అతని ఖాతాలోంచి రూ. 99 వేలు మాయమయ్యాయి. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిఃమిలిటరీ అధికారినంటూ లక్షా 20 వేల మోసం