ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదుతోపాటు 12ఏటీఎం కార్డులు, 21సిమ్ కార్డులు రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. వీరంతా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారని సజ్జనార్ తెలిపారు. వీరందరూ 40కేసుల్లో నిందితులని చెప్పారు. ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్ నేరాలు పెరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని సజ్జనార్ వివరించారు. ప్రత్యేక బృందం భరత్‌పూర్‌కు వెళ్లి నెలరోజులపాటు కష్టపడి 5గురిని పట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు రుక్మిన్ అతని స్నేహితులతో కలిసి ఓఎల్‌ఎక్స్ నేరాలకు పాల్పడ్డాడని సీపీ స్పష్టం చేశారు.నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భరత్‌పూర్‌కి చెందిన వాళ్లుగా గుర్తించారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదుతోపాటు 12ఏటీఎం కార్డులు, 21సిమ్ కార్డులు రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
రుక్మిన్‌తోపాటు ముర్పీద్, సైకుల్ ఖాన్, షారుక్, రాఖామ్ ఖాన్‌లు ముఠాగా ఏర్పడి ఈ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్లు పంపి వస్తువుల కోసం రిక్వెస్టు పెట్టిన వారిని డబ్బులు పంపమని నగదు గుంజేవారని తెలిపారు. ఆర్మీ అధికారి పేరుతో తనకి ట్రాన్సఫర్ కావడంతో విలువైన వస్తువులు తక్కువ రేటుకే ఇచ్చేస్తానని సంప్రదించి వారి నుంచి డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారని సీపీ వివరించారు. ప్రజలు అందరూ ఓఎల్‌క్స్‌లో వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని...వస్తువును చూసి నమ్మకం వచ్చిన తర్వాతే కొనాలని సీపీ సజ్జనార్ సూచించారు.
ఇవీ చూడండి:కీసర లంచం కేసులో మరో ఐదుగురు అరెస్టు