ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పాత ఇల్లు కూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే నగరంలో పదుల సంఖ్యలో నేలమట్టమయ్యాయి. ఖిలా వరంగల్ పడమర కోటలో ఇల్లు కూలి వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు.
ఖిలా వరంగల్ ప్రాంతంలో పాత ఇల్లు కూలి వృద్ధుడు దుర్మరణం - పాత ఇల్లు కూలి వృద్ధుడు దుర్మరణం
వర్షానికి ఇల్లు కూలి వృద్ధుడు మృతి చెందిన ఘటన... ఖిలా వరంగల్ పరిధిలోని పడమర కోటలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన బల్దియా అధికారులు... బలహీనమైన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఖిలా వరంగల్ ప్రాంతంలో పాత ఇల్లు కూలి వృద్ధుడు దుర్మరణం
అప్రమత్తమైన బల్దియా అధికారులు... పాత భవనాలను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఏడు వందలకు పైగా పాత ఇళ్ల యజమానులకు నోటీసులు అందజేసినట్టు బల్దియా పట్టణ ప్రణాళిక అధికారులు తెలిపారు.
Last Updated : Aug 17, 2020, 4:56 PM IST