తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చందపూర్​లో విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి - siddipet dist latest news

సిద్దిపేట జిల్లా చందపూర్​లో విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి చెందింది. బోర్​ వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లి పైపు పట్టుకోగా కరెంట్​ షాక్​ తగిలింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని కుమారుడు నరసయ్య ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Old women Died of Current shock at chandapur village in sangareddy district
విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి

By

Published : Jun 27, 2020, 8:54 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బెజగామ లచ్చవ్వ అనే వృద్ధురాలు ఇంటి వెనకున్న బోర్ వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఈ క్రమంలో బోరు పైపు పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న మరో మహిళ చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

వృద్ధురాలిని గ్రామంలోని ఆర్ఎంపీ​ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని కుమారుడు నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details