నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్లో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి బసవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బసవమ్మ ఇంట్లో గోడ పక్కన మంచంపై పడుకున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలి ఆమెపై పడింది. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీశారు.
గోడ కూలి వృద్ధురాలు మృతి - గోడ కూలి వృద్ధురాలు మృతి
ఇంటి గోడ కూలి వృద్ధురాలు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్లో చోటుచేసుకుంది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు గోడ పూర్తిగా తడిచిపోయి కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గోడ కూలి వృద్ధురాలు మృతి
తీవ్రంగా గాయపడిన బసవమ్మను నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు గోడ పూర్తిగా తడిచిపోయి కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:ఆసరా పింఛన్లకు రూ.2931.17 కోట్లు విడుదల