బతుకు భారమై వృద్ధురాలు ఆత్మయత్యాయత్నం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో చోటు చేసుకుంది. జయమ్మ అనే వృద్ధురాలు కొడుకు, కోడలు సరిగా చూసుకోవడం లేదని ఆవేదనతో బలవన్మరణానికి యత్నించింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలోని కృష్ణానదిలో దూకింది. ఇది గమనించిన జాలర్లు వెంటనే సాహసించారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా... లెక్కచేయకుండా పుట్టి సాయంతో ఆమెను కాపాడారు.
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం... జాలర్ల సాహసం - జోగులాబం గద్వాల జిల్లా నేర వార్తలు
కొడుకు, కోడలు సరిగా చూడడం లేదని మనోవేదనకు గురైంది ఓ వృద్ధురాలు. చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో కృష్ణా నదిలో దూకింది. ఇది గమనించిన జాలర్లు నీటి ఉద్ధృతి అధికంగా ఉన్నా... సాహసించి పుట్టి సాయంతో ఆమెను కాపాడారు.
![వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం... జాలర్ల సాహసం](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
బయటకు తీసుకొచ్చాక ఎందుకిలా చేశావని జాలర్లు ప్రశ్నించగా... కొడుకు, కోడలు సరిగా చూడడం లేదని వాపోయింది. విషయం తెలుసుకున్న ఇటిక్యాల ఎస్సై సత్యనారాయణ వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ఇదీ చదవండి:మనస్తాపంతో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య