ఏడేళ్ల చిన్నారిపై మద్యం మత్తులో అత్యాచారయత్నం చేసిన ఓ తాతయ్య (వరుసకు)... చివరకు ఆత్యహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగింది. మిత్రులతో ఆడుకుంటున్న చిన్నారిని... ఇంటి పక్కనే ఉండే వృద్ధుడు నూర్‌బాషా షార్జహాన్ (60).. మాయమాటలు చెప్పి తన ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు
ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం - మేడికొండూరులో చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం బయటికి తెలియగా.. స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. మనస్తాపానికి గురైన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన వృద్ధుడు
అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను.. పాప నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచార యత్నం చేయబోయాడు. అదే సమయంలో బిడ్డను వెతుకుంటూ వృద్ధుడి ఇంటికి వచ్చిన తల్లి.. ఆ సన్నివేశాన్ని చూసి బిత్తరపోయింది. విషయం తెలిసుకున్న చిన్నారి బంధువులు సాయంత్రం వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. అప్పటికే మనస్తాపానికి గురైన షార్జహాన్... బుధవారం తెల్లవారుజూమున షార్జహాన్ ఉరేసుకొని పాల్పడ్డాడు.
ఇదీ చదవండి :మరో క్రిమిసంహారక మందుపై ప్రభుత్వం నిషేధం