యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో డెబ్భై సంవత్సరాల వృద్ధుడు అనారోగ్య కారణాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన సిరికొండ సత్తయ్య వాచ్‌మెన్‌గా పనిచేస్తూ.. ఆజాద్ రోడ్డులో నివసిస్తున్నాడు. గత కొద్దికాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్య విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన సత్తయ్య ఇంటి ముందున్న గేట్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అంజయ్య తెలిపారు.
అనారోగ్యంతో.. వృద్ధుడు ఆత్మహత్య! - భువనగిరి పట్టణం
ఆరోగ్యం బాగలేక మనస్తాపం చెంది వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా.. భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![అనారోగ్యంతో.. వృద్ధుడు ఆత్మహత్య! Old Man Suicide In Bhuvanagiri Town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8598839-409-8598839-1598668576901.jpg)
అనారోగ్యంతో.. వృద్ధుడు ఆత్మహత్య!