కృత్రిమ గర్భధారణ కోసం యువతితో ఒప్పందం కుదుర్చుకున్న ఓ వృద్ధుడు ఆ తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. తనతో సహజ సిద్దంగానే పిల్లల్ని కనాలని బలవంతం చేశాడు. ముసలోడి కుట్ర తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్వరూప రాజ్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అనంద్‌నగర్‌లో జరిగింది.
64ఏళ్ల వృద్దుడికి ముగ్గురు ఆడపిల్లలు..
స్థానికంగా నివాసముంటున్న స్వరూపరాజ్ అనే 64 ఏళ్ల వృద్దుడికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. అయితే కొడుకు కావాలనే ఉద్దేశ్యంతో.. తన మిత్రుడైన నూర్‌తో మధ్యవర్తిత్వం కుదుర్చుకున్నాడు. 23ఏళ్ల యువతితో కృత్రిమ గర్భధారణకు రూ.5లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. వీటికి తోడు వైద్య ఖర్చుల నిమిత్తం నెలకు రూ.పదివేలు ప్రసవం జరిగేంత వరకు చెల్లిస్తాన్నాడు.