తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు నీట మునిగి వృద్ధుడు మృతి - చెరువులో పడి వృద్ధుడు మృతి

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి ఓ వృద్ధుడు మృతి చెందారు. మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

old man died with water flow in mahabubabad district
ప్రమాదవశాత్తు నీట మునిగి వృద్ధుడు మృతి

By

Published : Oct 27, 2020, 9:17 AM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన అల్వాల ముత్తయ్య గొర్రెలకు నీళ్లు తాగించేందుకు చెరువు వద్దకు వెళ్లారు. గొర్రెలు నీటిలో మునగగా వాటిని కాపాడేందుకు చెరువులోకి దిగి నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

ఇదీ చదవండి:ద్విచక్రవాహనం, కారు ఢీ... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details