యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లకు చెందిన రాచకొండ పెద్దయాదయ్య(60) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రోజు తాగివచ్చి భార్యతో వాగ్వాదానికి దిగగా.. విసిగిపోయిన ఆమె తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయింది.
భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య - old man suicide in bhuvanagiri district
కలుపు మొక్కలకు వేసే మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్లలో చోటుచేసుకుంది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భువనగిరిలో వృద్ధుని ఆత్మహత్య
ఇది భరించలేని యాదయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఉదయం కలుపు మొక్కలకు వేసే మందు తాగి ఆత్మయత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు యాదయ్యను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా.. హైదరాబాద్ గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న యాదయ్య ఆదివారం ఉదయం మృతి చెందాడు.
- ఇదీ చూడండి :ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం