జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో విషాదం జరిగింది. వృద్ధ దంపతులు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిద్దరూ ఒకేరోజు పోవడం కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. గ్రామానికి చెందిన అయిత పోచిరెడ్డి(80), మొండెమ్మ(75) దంపతులు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మరణంలోను తోడుగా ... ఒకేరోజు మృతి చెందిన వృద్ధ దంపతులు - భూపాలపల్లి వార్తలు
ఒకటే ప్రాణం రెండు రూపాలుగా జీవించేవారే ఆలుమగలని అంటారు పెద్దలు. కలకాలం కలిసుంటానని వివాహ సమయంలో ప్రమాణం చేసిన భర్త.. పెళ్లిలో భర్త వెంట ఏడడుగులు కలిసి వేసిన భార్య... అంతిమ సమయంలో ఒకరిని ఒకరు విడిచి పోలేదు. ఒకరి వెంటే మరొకరు మృత్యుఒడిలోకి చేరారు. ఈ విషాద ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో జరిగింది.
మరణంలోను తోడుగా ... ఒకేరోజు మృతి చెందిన వృద్ధ దంపతులు
గురువారం ఒకరు మరణించిన కొంతసేపటికే మరొకరు మృతిచెందారు. కుటుంబసభ్యులు గమనించే సరికి ఇద్దరు మృతిచెందారని గ్రామస్థులు తెలిపారు. దంపతుల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై కాళేశ్వరం పోలీసులని సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.
ఇదీ చూడండి:యువకుని వేధింపులు తట్టుకోలేక 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య