ములుగు జిల్లా కేంద్రంలోని మజీద్ వెనక వీధిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి వెళ్లడం వల్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాగితపు సాంబయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పసుపు, కుంకుమ, కోడిగుడ్డు వదిలేసి వెళ్లారు.
ఇంటి ముందు క్షుద్రపూజల కలకలం... భయాందోళనలో కుటుంబం - ములుగు జిల్లాలో నేరవార్తలు
ములుగు జిల్లా కేంద్రంలో ఓ ఇంటి ముందు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. ఫలితంగా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఓ ఇంటి ముందు క్షుద్రపూజల కలకలం... భయాందోళనలో కుటుంబం
ఉదయాన్నే లేచిన సాంబయ్య భార్య ఇంటి పనులు చేస్తుండగా కొలిమి వద్ద క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులు కనపడడం వల్ల కుటుంబ సభ్యులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
ఇదీ చూడండి:బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్ మృతి, మరో ముగ్గురు గల్లంతు