నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్లోని చిన్న హనుమాన్ మందిర్ సమీపంలో పలువురు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో గుప్త నిధులతో పాటు, కుటుంబంలో శాంతి కోసం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బండె మోహన్, జానకంపేట గ్రామానికి చెందిన బోయిడి సాయి, వినయ్ అనే ముగ్గురు పూజలు చేస్తున్నారు.
జానకంపేట్లో క్షుద్రపూజల కలకలం - nizamabad
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు యువకులను ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
జానకంపేట్లో క్షుద్రపూజల కలకలం
పసుపు, కొబ్బరికాయ పెట్టి పూజలు నిర్వహిస్తుండగా పలువురు కాలనీ వాసులు వారిని పట్టుకుని చితకబాదారు. అనంతరం వారిని పక్కనే ఉన్న హనుమాన్ ఆలయంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు.