నిజామాబాద్ నగరంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో పోలీసులు, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ సిబ్బంది దాడులు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు రూ. మూడు లక్షలు విలువ చేసే గుట్కా, జర్దా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.
ఓ ఇంట్లో.. రూ. 3లక్షల గుట్కా పొట్లాలు పట్టివేత - గుట్కాప్యాకెట్లను సీజ్ చేసిన నిజామాబాద్ పోలీసులు
నిజామాబాద్ నగరంలోని ఓ ఇంట్లో పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు.
![ఓ ఇంట్లో.. రూ. 3లక్షల గుట్కా పొట్లాలు పట్టివేత Nizamabad police seized gutka packets from a house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9405478-338-9405478-1604326659316.jpg)
ఓ ఇంట్లో.. రూ. 3లక్షల గుట్కా పొట్లాలు పట్టివేత
నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పక్కా సమాచారం మేరకే ఈ సోదాలు నిర్వహించామని షాకేర్ అలీ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:శంషాబాద్ విమానాశ్రయంలో 5.7 కేజీల ఎర్రచందనం స్వాధీనం
TAGGED:
నిజామాబాద్లో పోలీసుల సోదాలు