తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పర్యాటకులు నిబంధనలు పాటించేలా చూడాలి: సీపీ కార్తికేయ

నిజామాబాద్ జిల్లా అలిసాగర్​లో ఆదివారం సాయంత్రం జరిగిన ముగ్గురు అమ్మాయిల మృత్యువార్త తెలుసుకున్న సీపీ కార్తికేయ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సందర్శకుల తీరుపై అనుమానాలు ఉంటే బోటింగ్ నిర్వాహకులు విచారణ చేయాలని సీపీ సూచించారు.

పర్యాటకులు నిబంధనలు పాటించేలా చూడాలి: సీపీ కార్తికేయ
పర్యాటకులు నిబంధనలు పాటించేలా చూడాలి: సీపీ కార్తికేయ

By

Published : Nov 16, 2020, 11:02 PM IST

నిజామాబాద్ ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్​లో ఆదివారం సాయంత్రం ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటనపై నిజామాబాద్ సీపీ కార్తికేయ సోమవారం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. రిజర్వాయర్లో చివరన ఉన్న స్థలానికి పర్యాటకులు ఎలా వెళ్లారని ఆరా తీశారు. బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న నిర్వాహకుల సూచనలు పట్టించుకోకుండా అంత దూరం ఎట్లా వెళ్లారని, కనీస భద్రతా చర్యలు పర్యాటకులు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకనుంచి పర్యాటకులు అందరూ నిబంధనలు పాటించేలా చూడలన్నారు. అలీసాగర్​లో పోలీసుల పర్యవేక్షణ కొనసాగేలా చూస్తామన్నారు. సందర్శకుల తీరుపై అనుమానాలు ఉంటే బోటింగ్ నిర్వాహకులు విచారణ చేయాలని సీపీ సూచించారు. చెరువు కట్టపై సాయంత్రం వేళల్లో ఎవరు వెళ్లకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏసీపీ రామారావు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఎల్లా గౌడ్ ఉన్నారు.

ఇదీ చదవండి:అలీసాగర్ జలాశయంలో ముగ్గురు యువతుల మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details