అయినవారిని, పుట్టిన ఊరిని వదిలి ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్ దేశానికి వెళ్లిన కడుదురం పోశెట్టి అనే వ్యక్తి మృతిచెందడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. చివరి చూపు కోసం మృతదేహాన్ని ఇంటికి రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి గత పది సంవత్సరాలుగా గల్ఫ్ దేశంలో పని చేస్తున్నారు. గత పది రోజుల క్రితం అనారోగ్యంతో పోశెట్టి మృతి చెందారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గల్ఫ్‌లో నిర్మల్ జిల్లా వాసి మృతి - Nirmal district resident died in Gulf
కుటుంబ పోషణ కోసం గల్ఫ్ బాట పట్టిన నిర్మల్ జిల్లా కూచన్‌పల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృత్యువాత విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాన్ని ఎలాగైనా సొంతూరుకు చేర్చాలని వేడుకుంటున్నారు.
గల్ఫ్‌లో నిర్మల్ జిల్లా వాసి మృతి
నిరుపేద కుటుంబం కావడం వల్ల గల్ఫ్ దేశం వెళ్లి నలుగురు కూతుళ్లలో ఇద్దరి పెళ్లి చేశాడు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడం వల్ల కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పోశెట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించి.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని భార్య పద్మ, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందే దగ్ధమైన వరిగడ్డి