తెలంగాణ

telangana

కాగజ్​నగర్​లో 19 టన్నుల నల్లబెల్లం పట్టివేత

లాక్​డౌన్​తో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొంత మంది గుడుంబా తయారీ మొదలుపెట్టారు. కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో గుడుంబా తయారీకి అవసరమైన నల్లబెల్లం విక్రయిస్తూ కొందరు వ్యాపారులు పట్టుబడ్డారు.

By

Published : Apr 23, 2020, 3:23 PM IST

Published : Apr 23, 2020, 3:23 PM IST

black jaggery caught in kagaznagar
కాగజ్​నగర్​లో 19 టన్నుల నల్లబెల్లం పట్టివేత

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్​డౌన్​ అమలు చేస్తున్నందున మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు గుడుంబా తయారీకి అవసరమైన నల్ల బెల్లాన్ని విక్రయిస్తున్నారు.

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో ఓ వ్యాపారి అధిక మొత్తంలో నల్లబెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నాడనే సమాచారం మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా ఉంచారు.

రాత్రి 2 గంటల సమయంలో బెల్లం రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. సుమారు రూ.6 లక్షల విలువైన 19 టన్నుల బెల్లం, లారీ స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details