తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బంగ్లాదేశ్‌ నుంచి యువతుల అక్రమ రవాణా... 12 మంది అరెస్ట్‌ - హైదరాబాద్‌ నేర వార్తలు

మానవ అక్రమ రవాణా కేసులో 12 మందిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి యువతులను ఉద్యోగం పేరుతో నగరానికి తీసుకొచ్చి వ్యభిచార గృహాలకు తరలించిన వీరిపై నేరాభియోగ పత్రం దాఖలు చేశారు.

nia arrested international human trafficking accused persons in hyderabad
బంగ్లాదేశ్‌ నుంచి యువతుల అక్రమ రవాణా.. 12 మంది అరెస్ట్‌

By

Published : Oct 18, 2020, 7:31 PM IST

Updated : Oct 18, 2020, 8:52 PM IST

ఉద్యోగం పేరుతో బంగ్లాదేశ్‌ నుంచి యువతులను రప్పించి హైదరాబాద్‌లోని వ్యభిచార గృహాలకు తరలించిన 12 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో 9 మంది బంగ్లాదేశీయులున్నారు.

గతేడాది సెప్టెంబర్ 21న పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌లో మానవ అక్రమ రవాణాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్​పల్లి, బాలాపూర్‌లోని రెండు వ్యభిచార గృహాలపై దాడి చేసి 10 మంది అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేశారు. నలుగురు బంగ్లాదేశ్‌ యువతులను రక్షించారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడం వల్ల పోలీసులు కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు.

ఉద్యోగం పేరుతో

19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న బంగ్లాదేశ్‌ యువతులను ఉద్యోగం పేరుతో దళారులు కోల్‌కత తీసుకొచ్చి ముంబయి, హైదరాబాద్‌లోని వ్యభిచార గృహాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 12 మందిపై ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. వీరిపై నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:కళ్లముందే మూసీలో కొట్టుకుపోయిన వ్యక్తి

Last Updated : Oct 18, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details